ఏపీ ఈఏపీసెట్- 2025 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఈఏపీసెట్- 2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 89 వేల మంది, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగంలో 67, 761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ ఈఏపీసెట్- 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్- 2025లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 75,460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయినట్లు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,64,840 మంది హాజరయ్యారు. వీరిలో 71.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EAPCET 2025 Results Out Now Check Your Scores Like This

ఇక కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 19 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరిగాయి. మే 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు జరిగాయి.

ఎలా చెక్ చేసుకోవాలి..?

అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EAPCET/ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాల లింకును క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయాలి. అప్పుడు మార్కులతో పాటు ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+