AP ECET 2024: ఏపీ ఈసెట్ కు దరఖాస్తుల ప్రక్రియ మొదలు-ఆన్ లైన్లో అప్లై ఇలా..!
ఏపీలో పాలిటెక్నిక్ తో పాటు బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఈసెట్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ మొదలైంది. అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ) దరఖాస్తుల స్వీకరణను మొదలుపెట్టింది. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 15 వరకూ ఈసెట్ దరఖాస్తుల్ని ఆన్ లైన్ విధానంలో స్వీకరిస్తారు. వీటి వివరాలను జేఎన్టీయూఏ అధికారులు వెల్లడించారు.
ఏప్రిల్ 15 వరకూ ఆన్ లైన్లో ఈసెట్ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇవాళ్టి నుంచి https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15తో దరఖాస్తుల గడువు ముగిసినా.. ఏప్రిల్ 22 వరకూ రూ.500 ఫైన్ తో, ఏప్రిల్ 29 వరకూ 2 వేల ఫైన్ తో, మే 2 వరకూ 5 వేల ఫైన్ తో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఏపీ, తెలంగాణాల్లోని 100 పరీక్షా కేంద్రాల్లో మే 8న ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు.

వ్యవసాయ, ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఇన్ స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఈసెట్ పరీక్షలు ఉంటాయి. ఈసెట్ పరీక్షకు సంబంధించిన కీని మే 10న విడుదల చేస్తారు. దీనిపై మే 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. అనంతం కౌన్సిలింగ్, ఇతర తేదీలు విడుదల చేసి వాటి ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని జేఎన్టీయూఏ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications