ఏపీ ఎడ్ సెట్-2024 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం...
ఏపీ ఎడ్ సెట్-2024 మొదటి విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నేటి నుంచే ప్రారంభమయ్యింది. ఎడ్‌సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగలరు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. ధృవపత్రాల పరిశీలన ఈ నెల 22 నుంచి 28 వ తేది వరకు నిర్వహించనున్నారు.
బీఈడీ ఫస్ట్ ఇయర్, స్పెషల్ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలు కూడా జరిగాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బీఈడీలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇక, ఈ ప్రవేశాలకు గాను ఈ నెల (ఆగస్టు) 21వ తేది నుంచి ఆగస్టు 27 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను https://cets.apsche.ap.gov.in సంప్రదించగలరు.

వెబ్ అప్షన్ల నమోదు..
రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ కాపీ చేయగలరు. రిజిస్ట్రేషన్ కోసం ఓసి, బీసీ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థుల అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ, హెచ్ఎల్సీ లో ఆగస్టు 27న నిర్వహిస్తారు. ఈ నెల (ఆగస్టు) 29 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్ 5 నుంచి సీట్లు కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications