ఇంటర్ సిలబస్ లో మార్పులు - విద్యార్ధి ట్రాకింగ్, తాజా నిర్ణయాలు..!!
ఏపీలో ఇంటర్ సిలబస్ లో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. కొంత కాలంగా సిలబస్ మార్పు..పరీక్షా విధానం పైన చర్చ జరుగుతోంది. ఇంటర్ విద్యా విధానంలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయా అమలుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు అమ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
సిలబస్ మార్పు
ఇంటర్ విద్యాశాఖ కీలక మార్పులకు సిద్దమైంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి మొత్తం పాఠ్యాంశాలను(సిలబస్) మార్చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు అమ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సిలబస్ ను ఎన్‌సీఈఆర్‌టీలోకి మార్చినా పరీక్షల విధానం యథాతథంగానే కొనసాగించనుంది. ఎన్‌సీఈఆర్‌టీలో గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఇంటర్‌లో గణితం 2సబ్జెక్టులుగా ఉంటుంది. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ గణిత సిలబ్‌సను రెండుగా విభజించి 1ఏ, 1బీ, 2ఏ, 2బీలుగా అమలు చేయనుంది.

ట్రాకింగ్ విధానం
జేఈఈ, సీయూఈటీ, క్లాట్ లాంటి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగానే వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలు చాలా వరకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబ్‌సనే అనుసరిస్తున్నా యి. ఆ కారణంగానే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు ఎక్కువగా సాధిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులను కూడా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులపై ట్రాకింగ్ విధానం అమల్లో ఉంది.
లెక్చరర్లకు శిక్షణ
విద్యార్థులకు తరచూ పరీక్షలు నిర్వహించడం, వారు ఏ స్థాయిల్లో ఉన్నారో గుర్తించి దానికి అనుగుణంగా రెమిడియల్ తరగతులు నిర్వహించడం లాంటి బోధనా విధానం ఉంది. అలాంటి విధానాన్నే ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేటు కాలేజీల తరహాలో రెమిడియల్ తరగతుల విధానాన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఇటీవల ప్రారంభించారు. గతంలో జనవరి నుంచి ఈ విధానం అమలు చేసేవారు. ఇకపై దీనిని నిరంతరం అమలుచేయాలని భావిస్తున్నారు. చ్చే ఏడాది నుంచి మారనున్న సిలబస్ కు అనుగుణంగా జూనియర్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్, కొత్త బోధనా విధానంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications