ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు (7వ తేదీ మినహా) జరగాల్సి ఉన్నాయి. అయితే, వీటిని వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. మొత్తం 1,48,881 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 4496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ఐటీఐ, డిప్లొమా అర్హతలతో - పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 1031 పోస్టులు
ఢిల్లీలోని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,031 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్/ రీజియన్: సదరన్ రీజియన్-I (హైదరాబాద్), సదరన్ రీజియన్-II (బెంగళూరు), కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-I (ఫరీదాబాద్), నార్తెర్న్ రీజియన్-II (జమ్ము), నార్తెర్న్ రీజియన్-III (లఖ్‌నవూ), ఈస్ట్రన్ రీజియన్-I (పట్నా), ఈస్ట్రన్ రీజియన్-II (కోల్‌కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్ (భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-I (నాగ్‌పుర్), వెస్ట్రన్ రీజియన్-II (వడోదర),
వివరాలు:
ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటీస్‌షిప్
విభాగాలు, ట్రేడ్స్:
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.
అర్హతలు :
పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలం :
ఒక సంవత్సరం.
నెలవారీ స్టైపెండ్ :
ఐటీఐ ట్రేడ్ - రూ.13,500
డిప్లొమా ట్రేడ్ - రూ.15,000
గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ రాజ భాష అసిస్టెంట్ - రూ.17,500
ఎంపిక ప్రక్రియ : విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము : లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 20
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్ 8.












Click it and Unblock the Notifications