AP Inter Results 2024: ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల ఎప్పుడంటే ?

ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా.. వాటి పునఃపరిశీలనతో పాటు మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈ వారాంతంలో ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫలితాలతో పలు పోటీ పరీక్షలకు లింక్ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ నిర్వహించారు. ఇందులో ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నిన్నటితో వీరి జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో ఇవాళ్టి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం పునఃపరిశీలన చేయబోతున్నారు. అనంతరం డిజిటల్ గా నమోదు చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు.

ap intermediate exam results release in this weekend

ఇంటర్ ఫలితాలను ఫస్టియర్, సెకండియర్ కలిపి ఒకేసారి విడుదల చేయనున్నారు. దాదాపుగా ఈ నెల 12న ఈ రెండు ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అప్ లోడ్ చేస్తారు. కాబట్టి అభ్యర్ధులు ఫలితాలు విడుదల కాగానే బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి వాటిని తెలుసుకోవచ్చు. అనంతరం స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+