AP TET : ఆ టెట్ అభ్యర్థులకు శుభవార్త.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్..
ఏపీలోని కొందరు టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ శుభవార్త అందించింది. టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనిపై ఉన్నతాధికారులు తాజాగా స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను కూడా పొందుపర్చారు.
ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష వచ్చే నెల (అక్టోబర్) 3వ తేది నుంచి 21వ తేది వరకు జరగనునున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సారి రికార్డు స్థాయిలో టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల కొరత ఏర్పడడంతో అధికారులు పక్క రాష్ట్రాల్లోనూ ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర వాసులకు ఒడిశా, రాయలసీమ వారితో పాటు సమీపంలో ఉన్న వారికి బెంగళూరు, చెన్నై, మరికొంత మందికి హైదరాబాద్, ఖమ్మం వంటి సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. టెట్ హాల్‌టికెట్లు ఆన్‌లైన్ అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోగలరని అధికారులు సూచించారు.

ఏఏ తేదీల్లో ఏఏ పరీక్షలు..
అక్టోబరు 3వ తేది నుంచి 5 వ తేది వరకు రెండు సెషన్స్‌లోనూ పేపర్-2ఏ తెలుగు, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలు జరగనున్నాయి.
అక్టోబరు 6వ తేదిన ఎస్‌జీటీ పేపర్ 1ఏ, ఏబీ పరీక్షలు జరగనున్నాయి.
అక్టోబర్ 7 వ తేది నుంచి 10వ తేది వరకు రెండు సెషన్‌లలోనూ ఎస్జీటీ పేపర్-1ఏ పరీక్ష ఉంటుంది.
అక్టోబరు 11, 12 తేదీల్లో పరీక్షలు ఉండవు.
అక్టోబర్ 13వ తేది ఉదయం ఎస్జీటీ పేపర్-1ఏ పరీక్ష ఉండగా, మధ్యాహ్నం నుంచి ఎస్జీటీ పేపర్-1 తెలుగు, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఉర్దూ పరీక్షలను నిర్వహించనున్నారు.
అక్టోబర్14వ తేది ఉదయం ఎస్జీటీ పేపర్-1ఏ తెలుగు పరీక్ష జరగగా, మధ్యాహ్నం పేపర్-2ఏ గణితం, సామాన్య శాస్త్రం పరీక్ష ఉంటుంది.
అక్టోబర్15, 16 వ తేదీల్లో ఉదయం కలిపి పేపర్-2ఏ గణితం, సైన్సు పరీక్షలు జరగగా, 16వ తేదిన రెండో సెషన్‌లో పేపర్-2ఏ తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడం, ఒడియా, తమిళం, ఆంగ్లం జరగనున్నాయి.
అక్టోబర్17, 18, 19 తేదిల్లో గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయి.
అక్టోబర్ 20న పేపర్-2ఏ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, ఒడియా, తమిళం, ఆంగ్లం పరీక్షలు జరగగా, రెండో సెషన్‌లో సోషల్ సైన్స్ పరీక్ష జరగనుంది.
అక్టోబర్ 21వ తేదిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం పరీక్ష జరగగా, రెండో సెషన్‌లో పేపర్-2బీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది.












Click it and Unblock the Notifications