రూ. 72,000 జీతంతో ఉద్యోగాలు.. అప్లై చేసుకున్నారా..?

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 8లోపు అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

మొత్తం పోస్టులు: 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్- బీ నాన్ గెజిటెడ్ కేటగిరీ)

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు రూ.250 చెల్లించాలి. 05 ఫిబ్రవరి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. మార్చి 8 లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Apply Now 241 Junior Court Assistant Vacancies in Supreme Court Deadline March 8

విద్యార్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 18-30 మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది

ఎంపిక విధానం : ఆన్ లైన్ విధానంలో టెస్టు ఉంటుంది. ఆతర్వాత టైపింగ్ టెస్టు, డిస్క్రిప్టివ్ టెస్టు, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారితో ఎంపికైన జాబితా ప్రకటిస్తారు.

వేతనం: అన్నీ కలిపి నెలకు రూ. 72,040

అప్లై ఎలా..?

సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ https://www.sci.gov.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ పూర్తిచేసి సెండ్ చేయాలి. ఆ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

పరీక్ష విధానం: రెండు పేపర్లు ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ అప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉంటాయి. పార్ట్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్(25మార్కులు) ఉంటుంది. మొత్తం 125 మార్కులు ఉంటాయి. 2 గంటలపాటు పరీక్ష ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+