APPSC : గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్... మెయిన్స్ పరీక్ష వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్-2 అభ్యర్థులకు ఓ ముఖ్య గమనిక. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏపీపీఎస్సీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ, అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది.
రాష్ట్రంలో మొత్తం 899 పోస్టుల భర్తీకి గానూ గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,04,037 మంది హాజరయ్యారు. ఇక, ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 10వ తేదిన విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగింది. దీంతో మొత్తం 92,250 మంది అభ్యర్ధులను గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేశారు. మెయిన్స్‌కు ఎంపికైన వారందరికీ జూన్ 5వ తేది నుంచి 18వ తేది వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్, జిల్లా ప్రిఫరెన్సు వివరాలు నమోదు చేసుకోవాలని, ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఏపీపీఎస్సీ కోరింది. ఈ నెల 28న జరిగాల్సిన మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది.

మెయిన్స్ పరీక్షా విధానం..
ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తారు. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు ఉంటుంది.












Click it and Unblock the Notifications