ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 905 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ధృవపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ కోటా సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఎంపికైన వారందరికీ ధృవపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఫలితాలతోపాటు మెయిన్ పరీక్ష ఫైనల్ 'కీ'ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

ఏపీ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు తొలగిన అడ్డంకి
తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా, పిటిషన్ కొట్టివేతతో గ్రూప్1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.












Click it and Unblock the Notifications