ఈనెల 10వ తేదీలోపు APPSC GROUP 2 నోటిఫికేషన్...
APPSC గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు ఇటీవల ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన సంగతీ అందరికి తెలిసిందే. అయితే, ఇప్పడు ఈనెల 10వ తేదీలోపు APPSC GROUP 2 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసిన విషయం విదితమే. గ్రూప్ 2 పరీక్షలో రెండు దశల్లో రాతపరీక్ష ఉంటుంది. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులుగా భావిస్తారు.
గ్రూప్ 2 పరీక్ష విధానం : మొదటి దశలో జరిగే స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో జరిగే మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. అయితే, గతంతో పోల్చుకుంటే ఇప్పటి సిలబస్‌లో చాలా మార్పులు చేశారు. తాజా సిలబస్ ప్రకారం, ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చడం జరిగింది. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక, మెయిన్స్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. మొయిన్స్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగగా, పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.












Click it and Unblock the Notifications