ఏపీపీఎస్సీ గ్రూప్-4 మెయిన్స్ పరీక్ష తేదీ ఖరారు: 27 నుంచి హాల్ టికెట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఖరారు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తి చేసిన అధికారులు.. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4న రెండు షిప్టుల్లో నిర్వహించనున్నట్లు శుక్రవారం వెల్లడించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది.

మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్ పరీక్షకు హాజరు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications