ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్.. రెవెన్యూ శాఖలో 670, దేవాదాయ శాఖలో 60 పోస్టుల భర్తీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రెవెన్యూ శాఖలో 670 పోస్టులు, దేవాదాయ శాఖలో 60 పోస్టుల భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 30 నుంచి వచ్చే నెల(జనవరి) 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. జీతం రూ. 16 వేల నుంచి రూ. 50వేల వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు, నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/(S(yzppq3pizum55gy30d51jksk))/Default.aspx సంప్రదించవచ్చు.
రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/23_2021.pdf) విద్యార్హతలు, వయోపరిమతి, జిల్లాలవారీగా పోస్టుల వివరాలను తెలుసుకోవచ్చు.
https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/24_2021.pdf












Click it and Unblock the Notifications