Exams: ఒకే రోజు నాలుగు పరీక్షలు.. అయోమయంలో అభ్యర్థులు..
ఫిబ్రవరి 26న నాలుగు ఉద్యోగ నియామక పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.
నిరుద్యోగులు ఇన్న రోజులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడేమో నాలుగు పరీక్షలు ఒకే రోజు రావడంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఒకే రోజు స్టేట్ , సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 26న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది.
ఈ పరీక్షకు 1,06,263 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే రోజు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ ఉంది. ఇవి రెండే కాకుండా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పీఆర్టీ పరీక్షలు ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనున్నాయి. దీంతో పాటు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) పరీక్షలు 24 నుంచి 26 వరకు జరగనున్నాయి.

దీతో ఫిబ్రవరి 26న నాలుగు పరీక్షలు ఒకే రోజు ఉన్నాయి. ఒకే నాలుగు పరీక్షలు ఉండడంతో ఏం చేయాలో తెలియక అభ్యర్థులు మదన పడుతున్నారు. కేంద్రం పరీక్షలు తేదీలు మార్చాలంటే కష్టం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరీక్ష తేదీలు మార్చాలని కోరుతున్నారు. ఇప్పటికే డివిజినల్ అ కౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. చూడాలి.. రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష తేదీలు మార్చుతుందో లేదో.












Click it and Unblock the Notifications