విద్యార్థులకు గమనిక.. నీట్ పీజీ ఎగ్జామ్ 2024 సిటి సెంటర్ లిస్ట్ విడుదల..
నీట్ పీజీ 2024 పరీక్ష రాసే అభ్యర్థులకు గమనిక.. నీట్ పీజీ ఎగ్జామ్ 2024 సిటి సెంటర్ లిస్ట్ విడుదలయ్యింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ ఎగ్జామ్ 2024 పరీక్షకు సంబంధించిన సిటి సెంటర్ జాబితాను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా సిటిసెంటర్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నీట్ పీజీ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఎంట్రన్ టెస్టుకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు తప్పకుండా natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో సిటి సెంటర్ లిస్ట్‌ను చూడొచ్చు.
ఈ నెల 23 వతేదిన జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ, ఈ పరీక్ష కోసం గతంలో జారీ చేసిన అడ్మిట్‌కార్డుల్లో పొందుపరిచన సిటి సెంటర్‌లో ఇక చెల్లవని అధికారులు చెబుతున్నారు. కొత్త సిటి సెంటర్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకోసం అభ్యర్థులకు టెస్ట్ సిటి విండో ఈ నెల 19న అంటే నేడు ఈ ప్రక్రియ ప్రారంభవుతుంది. జూలై 22, 2024తో ఎగ్జామ్ సిటిసెంటర్ ఆఫ్షన్ ముగుస్తుంది. ఈ విండో ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో ఇందులో సిటి సెంటర్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ టెస్ట్ సిటీ కేటాయింపు జాబితా జూలై 29 న నీట్ పీజీ విద్యార్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీల ద్వారా తెలియజేస్తారు.

ఇక, కేటాయించిన పరీక్షా కేంద్రాలను అడ్మిట్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. నీట్ పీజీ 2024 పరీక్ష అడ్మిట్‌కార్డులు వచ్చే నెల 8, 2024 న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. నీట్ పీజీ పరీక్ష 2024 ఆగస్టు 11న జరగనుంది. అయితే అభ్యర్థులు మాత్రం పరీక్ష రాసేందుకు అనుమతించే షిఫ్ట్‌ను ఎంపిక చేయలేరు. రెండు షిఫ్టులకు సంబంధించిన పరీక్ష సమయాలను కూడా తగిన సమయంలో తెలియజేస్తారు. ఇక, ఈ పరీక్ష దేశవ్యాప్తంగా మొత్తం 185 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. నీట్ పీజీ 2024 అర్హత కోసం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేందుకు కటాఫ్ తేదీ ఆగస్టు 15గా ఉంటుందని సమాచారం. అభ్యర్థులు ఇతర పూర్తి సమాచారం కోసం ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించొచ్చు.












Click it and Unblock the Notifications