నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. రూ. 1,20,940 వేతనంతో జాబ్స్

బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ముంబై బ్రాంచిలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని.. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అనౌన్స్ చేసింది.

నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..

జాబ్ లొకేషన్ - ముంబై

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 180

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Bank of India Good News for the Unemployed Jobs with a Salary of Rs 1 20 940

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 ఫీజు ఉంటుంది.

విద్యార్హత: బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ పాసై ఉండాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: నెలకు ఎంఎంజీఎస్‌-2 ఉద్యోగానికి రూ.64,820 - రూ.93960, ఎంఎంజీఎస్‌-3 ఉద్యోగానికి రూ.85,920 - రూ.1,05,280, ఎంఎంజీఎస్‌-4 ఉద్యోగానికి రూ.1,02,300 - రూ.1,20,940 వేతనం ఉంటుంది.

వయస్సు: 2025 జనవరి 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకనే అభ్యర్థులు వయస్సు 23 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 23 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ https://bankofindia.co.in లో చూడొచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+