రిజర్వుడ్ అభ్యర్ధులు దొరక్కపోతే ఆ పోస్టులు జనరల్ గా మార్పు? కేంద్రం యూటర్న్!
కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్ధల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లపై యూజీసీ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు తీవ్ర కలకలం రేపాయి. ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్ధల్లో రిజర్వుడు కేటగిరీ పోస్టులకు ఆయా కేటగిరీల అభ్యర్ధులు దొరక్కపోతే అప్పుడు వాటిని డీరిజర్వుడ్ గా (రిజర్వేషన్ తొలగించాలని) మార్చాలని యూజీసీ ప్రతిపాదించింది. దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించింది. దీంతో ఉన్నత విద్యాసంస్ధల్లో ఉద్యోగాల రిజర్వేషన్లపై కలకలం రేగింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లను దూరం చేసే ప్రయత్నమంటూ దీన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు అన్యాయం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డాయి. JNU విద్యార్ధి సంఘం యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూజీసీ ఛైర్మన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎలాంటి డీరిజర్వేషన్ ఉండబోదని స్పష్టం చేశారు.

దేశంలోని ఉన్నత విద్యాసంస్ధల్లో ఉద్యోగాల భర్తీలో రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు తగిన రిజర్వుడు అభ్యర్ధులు దొరక్కపోతే ఆయా పోస్టుల్ని అన్ రిజర్వుడుగా మార్చేందుకు యూజీసీ ప్రతిపాదనలు ఆహ్వానించిన వ్యవహారంపై ముప్పేట దాడితో కేంద్రం వెనక్కి తగ్గింది. అలాంటి ఆలోచనేదీ లేదని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టత ఇచ్చింది. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం వెలువడాల్సి ఉంది. దీంతో యూజీసీ మార్గదర్శకాల్లో మార్పులు చేస్తుందా లేదా అన్నది త్వరలో తేలనుంది.












Click it and Unblock the Notifications