సీయూఈటీ-పీజీ 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌చేసుకోండి..!
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో గతనెల 11 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న 190 విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. నేడు ఈ పరీక్ష ఫలితాలను ఎన్‌టిఎ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది.
వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష మొత్తం 157 సబ్జెక్టుల్లో జరిగింది. సీయూఈటీ పీజీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్లో కూడా నిర్వహించారు.

సీయూఈటీ-పీజీ పరీక్ష ద్వారా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటిల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ కూడా ఉంటాయి. ఈ పరీక్ష ఆధారంగా సుమారు 344 పీజీ కోర్సులతో పాటుగా 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో కూడా ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. సీయూఈటీ పీజీ-2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందొచ్చు.
సీబీటి ఆధారంగా పరీక్ష..
ఏప్రిల్ 6న విడుదలైన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఏప్రిల్ 12న సీయూఈటీ పీజీ - 2024 ప్రవేశ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌టిఎ ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. సీయూఈటీ పీజీ పరీక్షను 105 నిమిషాలపాటు సీబీటీ ఆధారంగా నిర్వహించారు.
మొత్తం 75 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధించారు. సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు మూడు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరయ్యారు.












Click it and Unblock the Notifications