DRDO recruitment: ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల కోసం అప్లై చేయండి, భారీగా జీతం

న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ 'బి' ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డీఆర్డీవో ఆన్‌లైన్‌లో దరఖాస్తులో ఆహ్వానిస్తోంది. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యూయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొంది. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in లో రిజిస్ట్రేషన్ లింగ్ జనరేట్ అయినప్పటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(RAC) పేర్కొంది.

విద్యార్హతలు:
పోస్టులను బట్టి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్స్‌/మెకానికల్‌/కంప్యూటర్‌సైన్స్‌/ఎలక్ట్రికల్‌/మెటీరియల్‌ సైన్స్‌/కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌/సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో బీటెక్‌ పాసై ఉండాలి. మరి కొన్ని ఉద్యోగాలకు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మేథమెటిక్స్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో పాసై ఉండాలి. దీంతో పాటు గేట్‌ స్కోరు కీలకం.

 DRDO recruitment 2023: Apply for 181 Scientist posts.

చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు 31 నాటికి అభ్యర్థులు తమ డిగ్రీ/ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 181 పోస్టుల్లో దివ్యాంగులకు ఏడు పోస్టులను రిజర్వు చేశారు. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలు పొందిన వారికి మెట్రో నగరాల్లో నెలకు దాదాపు రూ.లక్ష వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం:
అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్‌ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

వయో పరిమితి:
అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు మించరాదు.

ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి:

rac.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

హోంపేజీలో, advt క్రింద వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి. సంఖ్య 144

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి

అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి

ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకోండి.

మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://rac.gov.in/download/advt145_26_0520231235.pdf

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+