భారీ జీతంతో ECIL ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ Electronics Corporation of India Limited (ECIL) నిరుద్యోగ ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశాన్ని ప్రకటించింది. కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులు Hyderabadలోని ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది.

విద్యార్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఐటీ వంటి విభాగాలకు ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు. అలానే సంబంధిత రంగంలో పని అనుభవం.. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ట్రబుల్‌షూటింగ్, టెక్నికల్ డాక్యుమెంటేషన్ నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.

ecil-notification-for-200-technical-officer-posts-in-various-departments-under-contract-system

వయస్సు పరిమితి..

  • గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/STలకు 5 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు
  • వయస్సు ధ్రువీకరణకు టెన్త్ సర్టిఫికెట్ లేదా బర్త్ సర్టిఫికెట్ అవసరం

వేతనం & ఇతర ప్రయోజనాలు..

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000 - ₹31,000 వేతనం
  • పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగింపు అవకాశం
  • పరిశ్రమ అనుభవం, ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పని చేసే అవకాశం
  • భవిష్యత్తులో PSU ఉద్యోగాలకు ఉపయోగపడే అనుభవం

ఉద్యోగ బాధ్యతలు..

  • డిఫెన్స్, అణు, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో సాంకేతిక సహకారం
  • ఎలక్ట్రానిక్ సిస్టమ్ టెస్టింగ్, మెయింటెనెన్స్, ఇన్‌స్టాలేషన్
  • డాక్యుమెంటేషన్, ఫీల్డ్ సపోర్ట్, ప్రాజెక్ట్ అమలు పనులు
  • టీమ్‌తో కలిసి R&D కార్యకలాపాల్లో పాల్గొనడం

ఎంపిక విధానం..

ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

అకడమిక్ రికార్డులు, సాంకేతిక పరిజ్ఞానం, పని అనుభవం ఇంటర్వ్యూలో కీలకంగా పరిగణిస్తారు.

ఇంటర్వ్యూ వివరాలు..

ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 24, 2026

అభ్యర్థులు ఉదయం నేరుగా వాక్-ఇన్ ద్వారా హాజరు కావాలి

ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రిజ్యూమ్ వెంట తీసుకురావాలి

వేదిక..

కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (CLDC), నలంద కాంప్లెక్స్, ECIL, హైదరాబాద్ - 500062

అధికారిక వెబ్‌సైట్: www.ecil.co.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+