Education News: పిన్న వయస్సులోనే UPSC క్లియర్ చేసిన యువతి.. టాప్ ర్యాంక్ వచ్చినా IAS కాదని..
Success Story: విద్యార్థి దశలో సరైన లక్ష్యాన్ని ఎంచుకుంటేనే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. ఇదే పద్ధతిలో ఎందరో విజయం సాధించారు. అట్టడుగు స్థాయిలోని వ్యక్తులు కూడా ప్రపంచం గర్వించే విధంగా ఎదిగారు. దేశంలోని అత్యంత కఠిన పరీక్షలలో ఒకటిగా చెప్పబడే UPSC ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేసి పలువురికి మాదిరిగా నిలిచారు. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నా, పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టు విడవకుండా వారు చేసిన పోరాట ఫలితమే ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన విదుషి సింగ్ దీనికి చక్కటి ఉదాహరణగా నిలిచారు. ఎందుకంటే 21 ఏళ్ల వయస్సులోనే UPSCకి అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. ఎటువంటి శిక్షణ లేకుండానే తన మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు. NCERT పాఠ్యపుస్తకాలతో పాటు అందుబాటులోని ఇతర మెటీరియల్‌ను రిఫర్ చేశారు. IASకు ఎంపికైనప్పటికీ ఆమెకి ఉన్న అభిరుచి కొద్దీ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌ను ఎంచుకున్నారు.

2022లో నిర్వహించిన UPSC సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలో 1039 మార్కులతో విదుషి సింగ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ (AIR)లో 13వ స్థానం సాధించారు. రాత పరీక్షలో 855 మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ రౌండ్)లో 184 మార్కులు రాబట్టారు. కాగా ఆర్థిక శాస్త్రాన్ని ఆమె ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. టాప్ ర్యాంక్ వచ్చినా IAS, IPS కాకుండా IFSను ఎంచుకోవడానికి కారణాన్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాత, నానమ్మల కల నెరవేర్చేందుకే ఈ సర్వీస్‌లో చేరినట్లు చెప్పారు. విదేశాల్లో ఉంటూనే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ కావాలని, భారతదేశానికి సేవ చేయాలని వారు ఎప్పుడూ కోరుకునేవారని తెలిపారు.
విదుషి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ప్రతిష్టాత్మక శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2021లో ఆనర్స్‌తో ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. UPSC ఎగ్జామ్ క్లియర్ చేసే క్రమంలో అనేక టెస్ట్ సిరీస్‌లు మరియు మాక్ పరీక్షలలో పాల్గొన్నారు. పరీక్షలకు సన్నద్ధం కావడంలో వాటి పాత్ర ఎంతో ఉందన్నారు.












Click it and Unblock the Notifications