నేడు యూపీఎస్‌సీ సివిల్స్ 2024 ప్రాథమిక పరీక్ష.. షరతులివే..!
నేడు (జూన్ 16) యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఇక, ఇప్పటికే అధికారులు పరీక్షకు సంబంధించిన అన్నీఏర్పాట్లను పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో నేడు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణ తీరుపై దేశ వ్యాప్తంగా ఆరోపణలు వచ్చిన క్రమంలో..ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లను 30 నిమిషాల ముందే మూసివేయాలని యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పరీక్ష కేంద్రాలవద్ద సీసీ కెమెరాలతోపాటు జామర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 'నో ఐడీ... నో ఎంట్రీ' విధానాన్ని కూడా అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డు లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కావున, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఐడీ కార్డులను తమ వెంట తీసుకెళ్లాలి.
ఇక, ఈ ఏడాదికి గాను మొత్తం 1056 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను కేవలం దివ్యాంగులకు మాత్రమే కేటాయించడం జరిగింది. రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా సివిల్స్ సర్విసెస్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్‌సీ ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే నేడు (జూన్ 16వ తేదీన) ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్లలో ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షను ఉంటుంది.

రెండు పేపర్లకు పరీక్షకు 30 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నారు. పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందువరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోపలికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత గేట్లను మూసివేస్తారు. అంటే ఉదయం 9 గంటల వరకు మాత్రేమ అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫోటో సరిగాలేనివారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలి.












Click it and Unblock the Notifications