ఫెయిలైనా విద్యార్ధులకు మరో ఛాన్స్.. తొలిసారి సప్లిమెంటరీ

విద్యార్థులు నష్టపోకుండా ఉండేలా 2025-26 విద్యా సంవత్సరం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సప్లిమెంటరీ పరీక్షలను ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే తొలిసారి వీరంతా సప్లిమెంటరీ పరీక్షలు రాయబోతున్నారు. ఇంతకీ ఈ సప్లిమెంటరీ పరీక్షలు ఎవరికంటే..

డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ తదితర కోర్సుల్లో ఇప్పటి వరకు సప్లిమెంటరీ పరీక్షలు అవకాశం లేదు. రెండేళ్ల వ్యవధి కలిగిన పారా మెడికల్ కోర్సుల్లో ఏదైనా సబ్జేట్ లో ఫెయిల్ అయితే మళ్లీ వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. అప్పుడు పరీక్ష రాయాల్సిందే. ఈ విధానంపై ఏపీ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. పారా మెడికల్ కోర్సులో చదివే విద్యార్థులకు తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించబోతుంది.

రెండేళ్ల వ్యవధి కలిగిన పారా మెడికల్ కోర్సు (డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్, కార్డియాలజీ తదితర)ల్లో ప్రవేశాలు పొందిన వారు పరీక్షల్లో అనుత్తీర్ణులైతే వార్షిక పరీక్షల సమయంలో జరిపే సప్లిమెంటరీ పరీక్షలను రాసే వారు. ఈ విధానంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాదివరకు వేచి ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు.

First Ever Supplementary Exams Introduced for Paramedical Students in Andhra Pradesh

మంత్రి శ్రీ సత్యకుమార్ ఆదేశాల మేరకు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు విద్యార్థులు నష్టపోకుండా ఉండేలా 2025-26 విద్యా సంవత్సరం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జారీచేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ప్రకారం అనుత్తీర్ణులైన విద్యార్థుల (ఫెయిల్ )నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సుమారు 5వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసే అవకాశం ఉంది. సప్లిమెంటరీ పరీక్షలను ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో నిర్వహిస్తామని 'ఏలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్ (పారా మెడికల్) కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

రెగ్యులర్ పరీక్షల్లో జాప్యానికి కూడా స్వస్తి

పారా మెడికల్ కోర్సులు 16 వరకు ఉన్నాయి. ఇంటర్ బైపీసీ/ ఎంపీసీ అర్హతతో ప్రతి ఏడాది సుమారు 20వేల మంది విద్యార్థులు వీటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2024 వరకు జులైలో జరగాల్సిన వార్షిక పరీక్షలు తీవ్ర జాప్యంతో అక్టోబరు నుంచి జనవరి మధ్య జరిగేవి. ఈ విధానానికి కూడా వైద్య ఆరోగ్య శాఖ స్వస్తి పలికింది. రెగ్యులర్ పరీక్షలను కిందటేడాది జులైలోనే నిర్వహించింది ఫలితాలు అక్టోబరులో వెలువడ్డాయి. దీనికి అనుగుణంగానే సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషను తాజాగా విడుదల చేశారు. విద్యార్థులకు కష్టాలు తప్పాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+