గేట్ 2025 ప‌రీక్ష తేదీలు వ‌చ్చేసాయ్‌.. ఆగస్టు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ..

ఇంజ‌నీరింగ్ అభ్య‌ర్థుల‌కు గ‌మ‌నిక‌.. గేట్ 2025 ప‌రీక్ష షెడ్యూల్ వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి గేట్ 2025 ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తారు. 'గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-2025' పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే గేట్ ప‌రీక్ష‌లు ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ సారి పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ తీసుకుంది. మొత్తం 30 పేపర్లకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ జూలై 12వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.

ఈ ప‌రీక్ష స్కోర్‌ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప‌రీక్ష‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్లు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సబ్జెక్టులపై అభ్యర్థుల సమగ్ర అవగాహనను అంచనా వేసేందుకే ఈ ప‌రీక్ష‌. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. చివరి సంవత్సరం చదువుతున్నడిగ్రీ విద్యార్థులూ కూడా అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్ట్ నెల‌ఖారులో ప్రారంభ‌మ‌వుతుంది.

GATE 2025 exam dates are coming application process at the end of August

గేట్‌ స్కోర్‌ ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్ట‌యిఫండ్ అందుకునే అవ‌కాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్‌ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో మొద‌టి ప్రాధాన్యం ఉంటుంది. ఐఐటీలు గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు పొందొచ్చు. కొన్ని సంస్థలు తమ కంపెనీల్లో వివిధ విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలు కూడా ఇస్తాయి. అభ్య‌ర్థులు ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం గేట్ 2025 అధికారిక వెబ్సైట్ ను సందర్శింగ‌ల‌రు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌రీక్ష నిర్వ‌హించే ప్రాంతాలివే..

చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+