రోహిత్ శర్మ రిటైర్మెంట్..!? తేల్చేసిన టీమిండియా కోచ్..!!
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారా. ఇంగ్లాండ్ తో లార్డ్స్ లో జరిగే చివరి వన్డే తో రోహిత్ తన కెరీర్ ను ముగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ విఫలమయ్యారు. రోహిత్ వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు చెబుతున్నారే వార్తల పైన టీమిండియా బ్యాటింగ్ కోచ్ స్పందించారు. టీం మేనేజ్మెంట్ ఆలోచన ఏంటో స్పష్టం చేసారు.
రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. తొలుత 2027 ప్రపంచ కప్ వరకు రోహిత్ వన్డేల్లో కొనసాగుతారని అందరూ భావించారు. అయితే, రోహిత్ ఇంగ్లాండ్ టూర్ లో విఫలం కావటంతో.. ఆ స్థానంలో యశస్వి జైస్వాల్ కు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో సెలక్షన్ కమిటీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు. రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. రోహిత్ వంటి దిగ్గజ ప్లేయర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేసారు. రోహిత్ ఒత్తిడిగా ఫీలయ్యే ఆటగాడు కాదని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టూర్ లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోయినా అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. రోహిత్ లో భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఇప్పటికీ ఉందని చెప్పారు. వన్డే క్రికెట్ లో ఎందరో హేమా హేమీలు ఇలా విఫలం అయిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. లార్డ్స్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రోహిత్ నుంచి పూర్తి భిన్నమైన ఇన్నింగ్స్ చూస్తామని ధీమా వ్యక్తం చేసారు. పిచ్‌పై డబుల్ బౌన్స్ కారణంగా అతడు సాధారణంగా ఆడే కొన్ని షాట్లు ఆడటానికి సౌకర్యంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ప్రచారం సాగుతున్నట్లుగా రోహిత్ తన పైన ఒత్తిడి కారణంగా వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెబుతారనే వార్తల్లో నిజం లేదని పరోక్షంగా వెల్లడించారు.














Click it and Unblock the Notifications