25 పెళ్లిళ్లు.. బయటపడిన బీజేపీ ఎమ్మెల్యే వియ్యంకుడి బాగోతం!

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ దిగ్భ్రాంతికర మోసం వెలుగులోకి వచ్చింది. సేవాతా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీని, ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా మోసగించిన కేసులో ఆయన వియ్యంకుడు(కూతురి మామ) అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రఖర్ త్రివేదిలపై పోలీసులు చర్యలు చేపట్టారు. నకిలీ ఐడీలతో దేశవ్యాప్తంగా దాదాపు 25 మంది మహిళలను పెళ్లి చేసుకుని మోసగించినట్లు నిందితుడిపై తీవ్ర ఆరోపణలు రావడంతో రేయుసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తనని నమ్మించి వివాహం
ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కూతురు ప్రజ్ఞా తివారీకి మిస్రిఖ్ ప్రాంతంలోని చంద్రావల్‌కు చెందిన అనుజ్ త్రివేది కుమారుడు ప్రఖర్ త్రివేదితో 2024లో వివాహం జరిపించారు. పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో అనుజ్ త్రివేది తాను ముంబైలో ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తనని చెప్పుకున్నాడు. స్థానికంగా విచారణ చేసినప్పుడు కొందరు ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించడంతో ఎమ్మెల్యే ఈ పెళ్లికి అంగీకరించారు. అయితే పెళ్లి జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా అనుజ్ త్రివేది అసలు రూపం బయటపడింది.

BJP MLA Duped In-Law Caught in 25 Fake Marriages Scam Case Filed and concealed his criminal past

దేశవ్యాప్తంగా 25 పెళ్లిళ్లు
పోలీసుల దర్యాప్తులో నిందితుడు అనుజ్ త్రివేది మహారాష్ట్రతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో నకిలీ ఐడీ కార్డులను ఉపయోగించి మహిళలను బురిడీ కొట్టించినట్లు తేలింది. దాదాపు 25 మంది మహిళలను పెళ్లి చేసుకుని ఆర్థికంగా, మానసికంగా మోసం చేసినట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు అతడిని, అతడి కుమారుడు ప్రఖర్ త్రివేదిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులైన పలువురు మహిళల ఫిర్యాదుల ఆధారంగా కూడా వీరిపై కేసులు నమోదయ్యాయి.

సంబంధాలు తెంచుకున్న ఎమ్మెల్యే
ఈ మోసం వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితుడు అనుజ్ త్రివేది తన నేర చరిత్రను, గత కేసులను దాచిపెట్టి తమ కుటుంబాన్ని మోసం చేశాడని ఆయన ఆరోపించారు. ఈ సంఘటన తమ కుటుంబానికి, ఎమ్మెల్యేగా తన సామాజిక ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించిందని పేర్కొన్నారు. అనుజ్ త్రివేది కుటుంబంతో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. ఐపీసీ సెక్షన్ 318(4) కింద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+