మహిళా ఎస్సైతో అనుచిత ప్రవర్తన.. పరారీలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ అరెస్ట్!
శ్రీకాకుళం జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఆరోపణలతో వైసిపి నేత చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపైనే దౌర్జన్యానికి దిగిన వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
విధుల్లో ఉన్న ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసు
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బూర్జ మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బందోబస్తు విధుల్లో భాగంగా బూర్జ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవల్లిక తన విధులను నిర్వర్తిస్తున్న క్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ , ఆయన అనుచరులు ఆమెను అడ్డుకున్నారు.

వైసీపీ నేతలతో పాటు, కార్యకర్తల పైన ఎస్సై ప్రవల్లిక ఫిర్యాదు
కేవలం మాటలతో సరిపెట్టకుండా, విధులకు తీవ్ర భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో మహిళా అధికారి అని కూడా చూడకుండా అత్యంత అమర్యాదకరంగా, అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నేతలతో పాటు, కార్యకర్తల పైన ఎస్సై ప్రవల్లిక బూర్జ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చింతాడ రవికుమార్ అరెస్ట్
వైసిపి ఇన్చార్జి చింతాడ రవికుమార్ ను ఏ వన్ గా చేర్చారు. అప్పటి నుండి ఆయన పరారీలో ఉన్నారు. పోలీసులు చింతాడ రవికుమార్ తో పాటు మరో 28 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇంతకుముందు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా, కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు.నేడు చింతాడ రవికుమార్ ను అరెస్ట్ చేశారు.
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ , కానీ పోలీసుల అరెస్ట్
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చింతాడ రవికుమార్ తో సహా పలువురు వైసిపి నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు వైసిపి నాయకులను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని ఈ కేసు పెట్టినట్టు ఓట్లు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాను శ్రీకాకుళం డిఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళుతున్న క్రమంలో రోడ్డుపైన కారు ఆపి తనను అదుపులోకి తీసుకున్నట్టు చింతాడ రవికుమార్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications