ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్: ఫిజికల్ టెస్ట్‌కు పిలుపు
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఇన్ఛార్జ్ ఛైర్మన్ ఆకే రవికృష్ణ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
కాగా, గత ప్రభుత్వంలో 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది జనవరిలో ప్రిమిలినరీ పరీక్ష నిర్వహించారు. 4,59,182 మంది ప్రిమిలినరీ పరీక్షకు హాజరు కాగా 95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, ఫిజికల్ టెస్ట్ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ తెలిపారు. నవంబర్ నెల 11వ తేదీ సాయంత్రం 3 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు slprb.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రిమిలినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలిచిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తాజాగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. డిసెంబర్ నెలలో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications