సీటెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ప్రిలిమినరీ కీ విడుదల..
సీటెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జులై-2024 సెషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ కీ విడుదలయ్యింది. సీబీఎస్‌ఈ తాజాగా సీటెట్ కీ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ప్రాథమికకీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీ తో పాటు అభ్యంతరాలను తెలిపేందుకు సీబీఎస్ఈ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన సీటెట్ జులై 2024సెషన్‌కు సంబంధించిన పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక, వీటి ఫలితాలు ఆగస్టులో విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది.
ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్‌లు ఉంటాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి మొదటి పేపర్ ఉంటుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే ఉపాధ్యాయులు రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది. సీటెట్ క్వాలిఫై అయితే ఈ స్కోర్ జీవిత కాల వ్యాలిడిటి ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

ఆగస్టులో ఫలితాలు..
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై సెషన్‌కి సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ ప్రాథమిక కీని తాజాగా సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ లోకి వెళ్లి తమ కీనీ చెక్ చేసుకోగలరు. ఈ ప్రాథమిక కీపై అభ్యంతరాల నమోదుకు కూడా సీబీఎస్ఈ అవకాశం కల్పించింది. వీటి ఫలితాలను ఆగస్టులో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 136 నగరాల్లో 20 భాషల్లో సీటెట్ పరీక్ష 2024 ను నిర్వహించారు. సీటెట్ పరీక్షలో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తిని ఈ పరీక్షలో ఉత్తీర్ణతగా పరిగణిస్తారు. సీటెట్ పరీక్షలో సాధించిన అర్హత కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు అయిన కేవీఎస్, ఎన్వీఎస్, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు వంటి వాటిలో ఉపాధ్యాయుల నియామకానికి తప్పనిసరి అయ్యి ఉండాలి.












Click it and Unblock the Notifications