నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సర్వ శిక్ష అభియాన్‌లో జాబ్స్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కెరీర్ మార్గదర్శనం, మానసిక ఆరోగ్యంపై కౌన్సిలింగ్ అందించేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 103 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 20, 2025 చివరి తేదీగా నిర్దేశించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం సర్వ శిక్ష అభియాన్ ఆఫీసు ప్రకటించింది.

మీరు ఈ ఉద్యోగానికి అర్హులు అయితే, ఈ అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోండి. ఇది మీ కెరీర్‌కు మలుపు తిప్పే లక్కీ ఛాన్స్ కావొచ్చని అంటున్నారు. "కాంట్రాక్ట్ జాబ్" అని కొట్టిపారేయకుండా..
ఇప్పుడే అప్లై చేయండి. నెలకు ఆకర్షణీయమైన జీతంతో పాటు, అవసరమైతే కాంట్రాక్టును పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇంకా సమయం ఉందని నిర్లక్ష్యం చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

good-news-for-the-unemployed-jobs-in-sarva-shiksha-abhiyan

అర్హతలు..

ఎమ్మెస్సీ/ఎంఏ సైకాలజీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా డిగ్రీలో సైకాలజీ ముఖ్య సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయస్సు...

అభ్యర్థి వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి

జీతం..

నెలకు రూ. 30,000

ఉద్యోగం విధానం..

కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. జూన్ 2025 నుంచి 10 నెలల కాలానికి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అవసరాన్ని బట్టి కాంట్రాక్టు పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు.

ఎంపిక విధానం..

మెరిట్ ఆధారంగా

ఉద్యోగ బాధ్యతలు..

విద్యార్థులతో ఒకరితో ఒకరు కౌన్సిలింగ్ సెషన్‌లు నిర్వహించాలి. కెరీర్, విద్య, వ్యక్తిగత బలాలపై విద్యార్ధులతో చర్చ జరపాలి. అలానే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి కెరీర్ ప్లానింగ్‌లో పాల్గొనాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలపై మద్దతు కల్పించాలి. బస్తీలు, గ్రామీణ ప్రాంతాల సందర్శన, స్థానిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి. మానసిక ఆరోగ్యంపై వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+