ఇంటర్న్‌షిప్‌కు నెలకు 30 లక్షల జీతమా? ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊహించని భారీ ఆఫర్స్..!

సాధారణంగా విద్యార్ధులు ఇంటర్న్ షిప్ అంటే కెరీర్ ప్రారంభంలో వృత్తిపరమైన అనుభవం సంపాదించే ఓ సాధనం. కానీ మన దేశంలో ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్ధులకు మాత్రం ఇది ఇప్పుడు ఓ ఊహించని భారీ ఆదాయ వనరుగా మారుతోంది. తాజా ఆర్దిక విశ్లేషణల ప్రకారం హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT) రంగంలో ఉన్న కొన్ని అగ్రశ్రేణి సంస్థలు ఇంటర్న్ షిప్ చేసే విద్యార్ధులకు నెలకు ఏకంగా 30 లక్షల వరకూ స్టైఫండ్ ను ఆఫర్ చేస్తున్నాయి. దీన్ని బట్టి హెచ్ఎఫ్టీ ఇంటర్న్ షిప్ ఆఫర్లు (HFT Internships Offer)
ఎలా ఉన్నాయో అర్దమవుతోంది.

ఇక ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు..! తొలిసారి అక్కడే..!
ఇక ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు..! తొలిసారి అక్కడే..!

ఇండియా టుడే కథనం ప్రకారం గురుగ్రామ్‌కు చెందిన ట్రేడింగ్ సంస్థ క్వాడై (Quadeye) ఇంటర్న్‌లకు నెలకు రూ.30 లక్షల చొప్పున రెండు నెలల కాలానికి రూ.60 లక్షల ప్యాకేజీని అందిస్తోంది. అలాగే, గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ రెండు నెలల ఇంటర్న్‌షిప్ కోసం రూ. 50 లక్షలు చెల్లిస్తుండగా, ఐఎమ్‌సీ ట్రేడింగ్, ఆప్టివర్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా రూ.50 నుంచి 60 లక్షల వ్యయంతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ వ్యవధి ఉండే ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేస్తుండటం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Engineering students are landing HFT internships with stipends of up to 30 lakh per month in 2026 Know the firms skills and opportunities driving the high-paying trading boom
టెన్త్ లో 54 శాతం మార్కులు- సీన్ కట్ చేస్తే IIT బోంబేలో సీటు...!
టెన్త్ లో 54 శాతం మార్కులు- సీన్ కట్ చేస్తే IIT బోంబేలో సీటు...!

ఈ సంస్థలు కేవలం సాధారణ షేర్ల విశ్లేషణ లేదా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను చదవగలిగే వారి కోసం చూడటం లేదు. గణితం, గణాంకాలు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లను మేళవించి స్వయంచాలక ట్రేడింగ్ వ్యూహాలను రూపొందించే 'క్వాంట్ రీసెర్చర్స్' నైపుణ్యాల కోసమే ఈ స్థాయి పోటీ నెలకొంది. మైక్రో సెకన్ల వ్యవధిలోనే ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవాల్సిన హెచ్‌ఎఫ్‌టీ మార్కెట్‌లో, అత్యంత వేగంగా డేటాను విశ్లేషించే అల్గారిథమిక్ సాంకేతికతలను సిద్ధం చేసే విద్యార్థులకు ఈ సంస్థలు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. దేశ డెరివేటివ్స్ మార్కెట్లో కఠినమైన నిబంధనల వల్ల ట్రేడింగ్ పరిమాణం తగ్గినప్పటికీ, నైపుణ్యమున్న నిపుణుల కోసం పోటీ మాత్రం బలంగా ఉంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నివేదిక ప్రకారం ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ఆధారంగానే మార్కెట్లో అత్యధిక శాతం లాభాలు వస్తున్నాయి. దీనితో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా త్వరితగతిన కొత్త ట్రేడింగ్ విధానాలను కనిపెట్టగలిగే నిపుణుల కోసం విదేశీ సంస్థలు సైతం భారతీయ ఐఐటీల ప్రాంగణ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.ఆర్థిక రంగంలో సాంప్రదాయ పెట్టుబడి నైపుణ్యాల కంటే డేటా సైన్స్, గణిత శాస్త్ర పరిజ్ఞానం ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాయో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+