ఐసీఎస్ఈ టెన్త్, ఇంట‌ర్ ఫ‌లితాలు వ‌చ్చేసాయ్‌.. ఇలా చెక్ చేసుకోండి..!

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుద‌ల‌య్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఐసీఎస్‌ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను 'కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోగ‌ల‌రు. ఈ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులు తమ యూఐడీ, ఇండెక్స్‌ నంబర్‌లతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

ఇక‌, ఈ సంవ‌త్స‌రం ఐసీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మొత్తం 2,43,617 మంది రాయ‌గా, వీరిలో 2,42,328 మంది ఉత్తీర్ణత సాధించిన‌ట్లు బోర్డు తెలిపింది. ఇక ఐఎస్సీ ఇంట‌ర్ పరీక్షలకు 99,901 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 98,088 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఐసీఎస్ఈ పాస్ పర్సెంటేజ్ 99.47శాతం ఉండ‌గా, ఐఎస్సీ పాస్ పర్సెంటేజ్ 98.19 శాతంగా నమోదయిన‌ట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఐసీఎస్ఈ ప‌ది ఫ‌లితాల్లో 99.65 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 99.31 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ ఇంట‌ర్ ఫలితాల్లో 98.92 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 97.53 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణుల‌య్యారు. ఈ రెండు ప‌రీక్ష‌ల్లోనూ బాలికలదే పైచేయి క‌న‌బ‌రిచారు. ఐసీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్, ఇంట‌ర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి https://resultsda89975eb26c6e4086d2c93f302788b8.trafficmanager.net/

ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి.

ICSE 10th and Inter results will come check this

ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌..

ఈ సంవ‌త్స‌రం ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 28 వరకు జ‌రిగాయి. ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 26న జరగాల్సిన 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షను రీషెడ్యూల్ చేసి మార్చ్ 21న నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల షెడ్యూల్‌ను సైతం బోర్డు విడుదల చేసింది. ఆ పరీక్షలు జులైలో జరగనున్న‌ట్లు తెలిపింది. సిఐఎస్‌సిఈ ఫలితాలకు సంబందించి విద్యార్థులకు రీ-చెకింగ్, రీ- వాల్యుయేషన్ వెసులుబాటును కల్పించింది. ఒక్కో సబ్జెక్ట్‌కు రీ-చెకింగ్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రీ- వాల్యుయేషన్‌కి రూ. 1,500 ఫీజు చెల్లించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+