తెలంగాణ సెట్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభం
తెలంగాణ స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET) సర్టిఫికెట్ల జారీని సంబంధిత అధికారులు గురువారం ప్రారంభించారు. గత సంవత్సరం మే నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఆన్‌లైన్ విానంలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను నవంర్ 16న విడుదల చేశారు.
ఈ క్రమంలో ధృవపత్రాల పరిశీలన పూర్తయిన అనంతరం సర్టిఫికెట్ల జారీని మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, సెట్ మెంబర్ సెక్రెటరీ, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్‌కుమార్ నాయక్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.

తెలంగాణ సెట్ అర్హత సాధించిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను సెట్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌తో వచ్చి తీసుకోవచ్చని తెలిపారు.
జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష షెడ్యూల్ ఇదే
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్(JEE-Main)-2025 సెషన్ 1 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలతో పాటు భారత్ బయట 15 నగరాల్లో ఈ పరీక్షలు జరగనుండటం గమనార్హం. జనవరి 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పేపర్ 1(బీఈ/బీటెక్) పరీక్ష జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్ష జరుగుతుంది. పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్), పేపర్ 2ఏ, 2బీ(బీఆర్క్, బీ ప్లానింగ్ రెండింటికి) పరీక్ష జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications