ఇంజినీరింగ్ ఆశావహులకు అలర్ట్: JEE Main Session-2 అప్లికేషన్స్ ఓపెన్
జేఈఈ మెయిన్-2026 రెండో దశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలి దశ పరీక్షలు సజావుగా పూర్తికావడంతో.. ఫిబ్రవరి 1 నుంచి 25వ తేదీ రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్ విధానంలో రెండో దశ పరీక్ష కోసం అప్లికేషన్లు తీసుకుంటామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. రెండో సెషన్‌కు సంబంధించిన జేఈఈ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్, హాల్ టికెట్‌లను నిర్ణీత సమయంలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. రెండో విడత ఫలితాలను ఏప్రిల్ 20 నాటికి వెల్లడించే అవకాశముందని ఎన్‌టీఏ పేర్కొంది.
దరఖాస్తు విధానం ఇలా...
మొదటి సెషన్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా రెండో సెషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సెషన్-1లో ఉపయోగించిన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పేపర్ ఎంపిక, పరీక్ష మాధ్యమం, పరీక్ష రాయదలచుకున్న నగరం, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను ధృవీకరించి పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అదనపు వివరాలను మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

మొదటిసారి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్‌తో పాటు అందించిన సమాచార పుస్తికను జాగ్రత్తగా చదివి, అందులో పేర్కొన్న సూచనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒక అభ్యర్థి ఒక్క అప్లికేషన్ మాత్రమే సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌టీఏ హెచ్చరించింది.
పేపర్ల వివరాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పేపర్-1 రాయాలి. బీ ఆర్కిటెక్చర్ కోర్సులకు పేపర్-2ఏ, బీ ప్లానింగ్‌కు పేపర్-2బీ నిర్వహిస్తారు. రెండు సెషన్లకు హాజరైన అభ్యర్థులలో ఉత్తమ స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులు ప్రకటిస్తారు.
తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 13 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్‌లో అర్హత మార్కులు సాధించిన దాదాపు రెండున్నర లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తుల సమయంలో ఏవైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైతే 011-40759000 లేదా 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే [email protected] కు ఈమెయిల్ పంపి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications