JEE Main 2025 results: ఫలితాలు వచ్చేశాయ్- పల్నాడు విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఙకు 100
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్ 2 (JEE Main results) ఫలితాలు వెల్లడయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్దిసేపటి కిందటే వీటిని విడుదల చేసింది. ఈ ఫలితాలను ఎన్టీఏ వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్, ఎన్టీఏ రిజల్ట్స్ అనే వెబ్‌సైట్లలో పరీక్షల ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ లింక్ jeemain.nta.nic.in, ntaresults.nic.in. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌తో పాటు అగ్రిగేట్ పర్సెంటైల్ మార్కుల స్కోరింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఈ వెబ్‌సైట్స్‌లల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు.. ఈ లింక్స్‌ను క్లిక్ చేయడం ద్వారా వాటిని తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది మొత్తం 24 మంది విద్యార్థులు 100 శాతం మార్కులను అందుకున్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. పల్నాడు జిల్లాకు చెందిన విద్యార్థిని గుత్తికొండ సాయి మనోజ్ఙకు 100కు 100 మార్కులను సాధించారు. రెండు సెషన్‌లలోనూ కూడా సాయి మనోజ్ఞ వందకు వంద మార్కులతో టాపర్‌గా నిలిచారు. పశ్చిమ బెంగాల్ విద్యార్థిని మాఝీ 99.99921 శాతం మార్కులు సాధించారు.
ఈ 24 మంది విద్యార్థుల్లో ఎండీ అనాస్, ఆయుష్ సింఘాల్, ఆర్కిస్మాన్ నంది, దేవదత్త మాఝి, ఆయుష్ రవి చౌదరి, లక్ష్య శర్మ, కుశాగ్ర గుప్తా, హర్ష్ ఎ గుప్తా, ఆదిత్ ప్రకాష్ భగాడే, దక్ష్, హర్ష్ ఝా, రజిత్ గుప్తా, శ్రేయాస్ లోహియా, సక్షమ్ జిందాల్, సౌరవ్, వంగల అజయ్ రెడ్డి, సాన్నిధ్య షరాఫ్, విషాద్ జైన్, అర్నవ్ సింగ్, శివేన్ వికాస్ తోష్నివాల్, సాయి మనోజ్ఞ గుత్తికొండ, ఓం ప్రకాష్ బెహెరా, బణి బ్రత మాఝీ ఉన్నారు.
జేఈఈ మెయిన్ పేపర్ 1 సెషన్ 2లో మొత్తం 9,92,350 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, వీరిలో 6,81,871 మంది మహిళలు, 3,10,479 మంది పురుషులు ఉన్నారు. వారిలో జనరల్ కేటగిరీలో అత్యధికంగా 3,72,675 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,50,849 మంది మహిళలు, 1,21,826 మంది పురుషులు ఉన్నారు.
ఓబీసీ కేటగిరీలో 3,74,860 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,58,274 మంది మహిళలు, 1,16,586 మంది పురుషులు ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1,12,790 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా ఇందులో 80,200 మంది మహిళలు, 32,590 మంది పురుషులు ఉన్నారు.
ఎస్సీ కేటగిరీలో 97,887 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 68,872 మంది మహిళలు, 29,015 మంది పురుషులు ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో అత్యల్పంగా 34,138 మంది పరీక్షలు రాయగా.. 23,676 మంది మహిళలు, 10,462 మంది పురుషులు ఉన్నారు. అన్ని కేటగిరీల్లో కూడా మహిళా అభ్యర్థులు అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications