రైల్వేలో ఉద్యోగాలు..1010 పోస్టులకు నోటిఫికేషన్..
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. 1010 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు నాన్-ఐటీఐ అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అకడమిక్ మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికయిన యాక్ట్ అప్రెంటీస్లకు నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ అందజేస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://pb.icf.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది. జూన్ 21, 2024 వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకోగలరు.

పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు - 1010
కార్పెంటర్ - 90 పోస్టులు
ఎలక్ట్రీషియన్ - 180 పోస్టులు
ఫిట్టర్ - 260 పోస్టులు
మెషినిస్ట్ - 90 పోస్టులు
పెయింటర్ - 90 పోస్టులు
వెల్డర్ - 260 పోస్టులు
ఎంఎల్టీ రేడియాలజీ -5 పోస్టులు
ఎంఎల్టీ పాథాలజీ - 5 పోస్టులు
పీఏఎస్ఏఏ - 10 పోస్టులు
వయసు
ఐటీఐ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 21 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
నాన్-ఐటీఐ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఫీజు వివరాలు..
ఇతర అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.












Click it and Unblock the Notifications