Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి

తమ పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనుకునే తల్లిదండ్రులకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి (Class 1) మరియు బాలవాటిక (Balvatika) తరగతుల్లో ప్రవేశాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా మార్చి 20, 2026 ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల విండో తెరుచుకోనుంది. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. తల్లిదండ్రులు అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం పొందాలంటే వయోపరిమితి నిబంధన అత్యంత కీలకం. ఒకటో తరగతిలో చేరాలనుకునే పిల్లలకు 2026 మార్చి 31 నాటికి 6 ఏళ్లు నిండి ఉండాలి (గరిష్టంగా 8 ఏళ్ల లోపు).

బాలవాటిక-1కి 3 నుంచి 4 ఏళ్లు,
బాలవాటిక-2కి 4 నుండి 5 ఏళ్లు,
బాలవాటిక-3కి 5 నుండి 6 ఏళ్ల వయస్సు ఉండాలి.

Kendriya Vidyalaya Admission Guide 2026 Documents Required Age Limits And Step-By-Step Application Process

ఈ నిబంధనల ప్రకారం వయస్సు సరిపోతేనే ఆన్‌లైన్ సిస్టమ్ దరఖాస్తును స్వీకరిస్తుంది. ఒకటో తరగతి, బాలవాటిక-1, 3 తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ పద్ధతిలో అడ్మిషన్లు జరుగుతాయి. ఒకవేళ రెండో తరగతి నుండి ఆపై తరగతుల్లో (11వ తరగతి మినహా) చేరాలనుకుంటే, ఏప్రిల్ 2 నుండి 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో ఖాళీలను బట్టి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ..

దరఖాస్తు ప్రక్రియను పరిశీలిస్తే, తల్లిదండ్రులు ముందుగా KVS అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ లో రిజిస్టర్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పిల్లల వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల సమాచారం మరియు నివాస ధృవీకరణ వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తులో గరిష్టంగా మూడు కేంద్రీయ విద్యాలయాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వెసులుబాటు ఉంది.

భారీ జీతంతో కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్‌ ఉద్యోగాలు..!
భారీ జీతంతో కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్‌ ఉద్యోగాలు..!

ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో పిల్లల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate), నివాస ధృవీకరణ పత్రం (Residence Proof), ఫోటో, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే) స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే తమ సర్వీస్ సర్టిఫికేట్ మరియు గత ఏడేళ్లలో జరిగిన బదిలీల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

పారదర్శకత కోసం..

ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం KVS పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 8న బాలవాటిక ఫలితాలు, ఏప్రిల్ 9న ఒకటో తరగతి తొలి ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఒకవేళ సీట్లు మిగిలితే ఏప్రిల్ 16న రెండో జాబితా, ఏప్రిల్ 21న మూడో జాబితా విడుదల చేస్తారు.

ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!

ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బంది పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను చాలా కఠినతరం చేశారు. అప్లికేషన్‌లో ఇచ్చిన సమాచారం మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఏమాత్రం తేడా ఉన్నా అడ్మిషన్‌ను తక్షణమే రద్దు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+