గిరిజన మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు: డిగ్రీ, ఎంబీఏ అర్హత ఉంటే అప్లయ్ చేయండి
గిరిజన మంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 16 అసిస్టెంట్ కమిషనర్, ఆఫీస్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్1/2, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 04 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: గిరిజన మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: అసిస్టెంట్ కమిషనర్, ఆఫీస్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్1/2, ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 16
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 04 ఫిబ్రవరి 2021.

విద్యార్హతలు:
అసిస్టెంట్ కమిషనర్ (అడ్మినిస్ట్రేటివ్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
అసిస్టెంట్ కమిషనర్ (ఫైనాన్స్) గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీకాంలో డిగ్రీ
ఆఫీస్ సూపరింటెండెంట్ (ఫైనాన్స్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీకాంలో డిగ్రీతో పాటు మూడేళ్లు అనుభవం, లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండటంతో పాటు రెండేళ్లు అనుభవం
వయస్సు: 27 నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
అసిస్టెంట్ కమిషనర్ పోస్టు: రూ.1200/-
ఆఫీస్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ -1 గ్రేడ్-2 ఆఫీస్ అసిస్టెంట్ అప్లికేషన్ : రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 5 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 4 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://tribal.nic.in/












Click it and Unblock the Notifications