నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి..
గత కొన్ని రోజులుగా నీట్ యూజీ ఎగ్జామ్ వార్తల్లో నిలిచింది. గతంలో జరిగిన నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ సమస్యల కారణంగా 1,563 మంది అభ్యర్థులకు నీట్-యూజీ 2024 రీఎగ్జామ్‌ను నిర్వహించింది. గత నెల 23న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీ-ఎగ్జామినేషన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1563 అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహించగా కేవలం 813 మంది మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇక, తాజాగా ఎన్‌టిఎ వీటి ఫలితాలను విడుదల చేసింది. నీట్ యూజీ 2024 రీఎగ్జామ్‌కు హాజరయిన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్‌చేసుకునేందుకు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను exams.nta.ac.in/NEET/ సంప్రదించగలరు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ లేదా మొబైల్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ ఫలితాలను చెక్ చేసుకోగలరు. అయితే ఈ సారి పరీక్షరాసిన 813 మందిలో ఒక్కరికి కూడా 720/720 మార్కులు సాధించలేకపోవడం గమనార్హం. దీంతో నీట్ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. నీట్ యూజీ రీఎగ్జామ్‌కు సంబంధించిన ఆన్సర్ కీని ఎన్‌టిఎ గతనెల 30వ తేదిన విడుదల చేసింది. ఇప్పడు తాజాగా ఆ పరీక్ష ఫలితాలను అభ్యర్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఫలితాలను చెక్‌చేయు విధానం..
అభ్యర్థులు ముందుగా ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో కనిపిస్తోన్న 'నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ 2024' ట్యాబ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. స్కోర్ కార్డు కావాలనుకునేవారు కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్కార్డులో తమ ఫోటో, బార్కోడ్ ఉండేలా చూసుకోవాలి. అవి లేకపోతే మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోండి..












Click it and Unblock the Notifications