ఈ నెల మూడోవారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం...
నీట్ (యూజీ) పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఎలాంటి ఆధారాల్లేవని, రీటెస్ట్ నిర్వహించే అవసరం లేదని, ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదిన సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జులై 18వ తేదికి వాయిదా పడింది.
ఎన్‌టీఏ దాఖలు చేసిన ప్రమాణ పత్రం ప్రతులు కొన్ని పక్షాలకు అందలేదని, అందుకే విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. మొదట విచారణను ఈ నెల15వ తేదికి వాయిదా వేయాలని న్యాయమూర్తులు భావించినప్పటికీ, కొందరు న్యాయమూర్తులు అందుబాటులో ఉండబోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలపడంతో ఈ నెల 18కి విచారణను వాయిదా వేశారు.

నీట్ యూజీ పరీక్షలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా విచారణ పురోగతికి సంబంధించి స్థాయీ నివేదికను ధర్మాసనానికి అందజేసింది. ఇక, విచారణ వాయిదాతో పాటు నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై మూడో వారం నుంచి ప్రారంభమవుతుందని, నాలుగు రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎన్టీఏ విడిగా ప్రమాణపత్రం దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో మార్కులపై విశ్లేషణ చేయించామని, ఎక్కడా అసాధారణ స్థాయిలు కనిపించలేదని తెలిపింది.












Click it and Unblock the Notifications