ఉద్యోగులకు బిగ్ షాక్.. ఒకేసారి 20 వేల మంది తొలగింపు..?
జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీలో పనిచేసే 20 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. అంటే కంపెనీల్లో 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. అయితే ఇండియా, చైనా మార్కెట్లలో లోకల్ కంపెనీలతో పోటీ పడలేక నిస్సాన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
నిస్సాన్ కార్ల తయారీ కంపెనీ.. తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏకంగా 20వేల మందిని ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ లో కంపెనీ ఆదాయం 94 శాతానికి పైగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉద్యోగుల తొలగింపులో భాగంగానే 7 మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లను కూడా మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిస్సాన్ కంపెనీకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 17 తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో వృద్ధి లేని 7 యూనిట్స్ ను తొలగించి మొత్తం కేంద్రాలను 10 కు తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాక నిస్సాన్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.38 వేల 385 కోట్ల(4.5 బిలియన్ యూఎస్ డాలర్లు) నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాస్ట్ కటింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది.
గత రెండు మూడేళ్లుగా నిస్సాన్ కార్ల అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయినట్లు సమాచారం. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications