ఏపీ జిల్లా కోర్టుల్లో 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల కోసం హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయో పరిమితి:
జులై 1, 2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022 తేదీ రాత్రి 11.59 నిమిషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులు రూ. 800, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులు రూ. 400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల నుంచి రూ. 61,960 వరకు జీతంగా చెల్లిస్తారు.
జిల్లాల వారీగా ఖాళీలను గమనించినట్లయితే..
అనంతపురం: 92
చిత్తూరు: 168
తూర్పు గోదావరి: 156
గుంటూరు: 147
వైఎస్సార్ కడప: 83
కృష్ణా: 204
కర్నూలు: 91
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు: 104
ప్రకాశం: 98
శ్రీకాకుళం: 87
విశాఖపట్నం: 125
విజయనగరం: 57
పశ్చిమ గోదావరి: 108.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications