The Odyssey Twitter Review: పోతారు.. మొత్తం పోతారు..!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో క్రిష్టోఫర్ నోలన్ ఒకరు. నోలన్ సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షంతో పాటు ఆస్కార్ అవార్డుల పంట అని చెబుతుంటారు. ఇప్పటి వరకూ 12 సినిమాలు తీసిన నోలన్.. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్నాయి. అలాగే తన సినిమాలకు ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అయితే నోలన్ తాజాగా తీసిన మూవీ ది ఒడిస్సీ మొత్తానికి రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ప్రివ్యూలు ఇవాళ అనేక ప్రాంతాల్లో పూర్తయ్యాయి. జూలై 17 నుంచి థియేటర్లలో విడుదల కానుంది. మరి ట్విట్టర్ నుంచి వస్తున్న కామెంట్స్, రివ్యూల ప్రకారం మూవీ ఎలా ఉంది..?

క్రిష్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ మూవీ థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీగా క్రేజ్ ఏర్పడింది. దేశంలోని చాలా చోట్లా ప్రీమియర్స్ పడ్డాయి. మూవీ అవుట్ స్టాండింగ్ అని చెబుతున్నారు. ఫుల్ 5 స్టార్ రేటింగ్స్ ఇస్తున్నారు. మరోసారి నోలన్ తన సినిమాటిక్ బ్రిలియన్స్ తో మాయ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇక భారత్ లోని ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. హైదరాబాద్ లో బుక్ మై షో లో టికెట్స్ సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. జూలై 17న ఈ మూవీ తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ విడుదల కానుంది.

ది ఒడిస్సీ మూవీ విషయానికి వస్తే ఈతాకా గ్రీక్ సామ్రాజ్యానికి అధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకుని ట్రోజన్ వార్ 10 ఏళ్లు జరిగిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీని హోమర్ రాసిన నవళ ఆధారంగా రూపొందించారు. ఈ మూవీలో ఒడిస్సీ పాత్రలో మాట్ డామన్, అతని సతీమణి పెనెలోప్ పాత్రలో అన్నె హాత్ వే నటించారు. ఇక ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ కీలక పాత్ర పోషించారు.

స్టోరీ విషయానికి వస్తే ట్రోజన్ వార్ పూర్తయి 10 ఏళ్లు కావొస్తున్నా ఇతాకా రాజు ఒడిస్సీ తన స్వదేశానికి తిరిగి రాడు. అయితే తన భర్త బతికే ఉన్నాడనే నమ్మకంతో రాణి పెనెలోప్ కాలం వెళ్లతీస్తుంటుంది. ఈ క్రమంలో రాణి పెనెలోప్ ను వివాహం చేసుకుని రాజ్యాన్ని దక్కించుకోవాలని అనేకమంది సూటర్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ సూటర్స్ లో అత్యంత క్రూరుడు ఆంటోనియస్(రాబర్ట్ ప్యాటిన్సన్) రాజ్యంపై దండెత్తక ముందే తన తండ్రిని వెతికి తీసుకురావాలని కుమారుడు టెలిమాకస్ సముద్ర ప్రయాణం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేదే స్టోరీ..

TheOdyssey Twitter Review Hollywood legend Christopher Nolan s movie an outstanding experience

ఈ మూవీ చూసిన నెటిజన్లు క్రిస్టోఫర్ నోలన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ది ఒడిస్సీ మూవీ చూడటం గొప్ప అనుభూతి అని చెబుతున్నారు. ఎమోషన్స్ తో కన్నుల పండుగలా ఈ మూవీని నోలన్ తెరకెక్కించారని అంటున్నారు. ఓ నెటిజన్ మాట్లాడుతూ.. సినిమా అద్దిరిపోయింది అని అన్నారు. మూడు గంటలు చెప్పలేని అనుభూతి అని తెలిపారు. మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ఈ మూవీని ప్రేక్షకులే కాదు.. దేవుళ్లు కూడా చూసేందుకు ఇష్టపడతారు అని తెలిపారు. ఈ మూవీ ఇచ్చిన అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనిదని కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+