సెర్ప్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పే స్కేలు అమలు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్-SERP) ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరికి వేతన స్కేలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు ప్రకటిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సెర్ప్ ఉద్యోగులకు కనీస స్కేలు 19,000-58,850, గరిష్ట స్కేలు 51,320-1,27,310 వర్తించనుంది. సంస్థలోని 3972 మంది ఉద్యోగులకు పేస్కేలు అమలు కానుంది. కాగా, పేస్కేలు అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 58 కోట్ల మేర భారం పడనుంది. ఏప్రిల్ 1 తేదీ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు అమలు కానుంది. పేస్కేలు వర్తింపజేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

పేస్కేల్ అమలు ఇలా ఉండనుంది:
మండల్ సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ - రూ. 19,000 - 58,850
మండల్ సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్(మండల్ రిప్రజెంటెటివ్ పర్సన్స్) - రూ. 19,000 - రూ. 58,850
మండల్ బుక్ కీపర్స్ - రూ. 22,240 - రూ. 67,300
కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ - రూ. 24,280 - రూ. 72,850
అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్ - రూ. 32,810 - రూ. 96,890
డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్స్ - రూ. 42,300 - 1,15,270
ప్రాజెక్టు మేనేజర్స్ - రూ. 51,230 - రూ. 1,27,310
డ్రైవర్స్ - రూ. 22,900 - రూ. 69,150
అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్రటరీస్ - రూ. 24,280 - రూ. 72,850
ఆఫీస్ సబార్డినేట్స్ - రూ. 19,000 - రూ. 58,850.












Click it and Unblock the Notifications