తెలంగాణలో పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం !
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి.. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 19 విభాగాల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో పలు కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశాలు కల్పించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పీజీఈసెట్-2025 పూర్తి వివరాలు..
విద్యార్హత..
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సులు..
ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో.. మొత్తం 19 విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తు విధానం..
మార్చి 17 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ..
మే 19, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల సవరణకు మే 22 నుంచి 24 వరకు అవకసం ఇచ్చారు. రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు మే 22, 2025 చివరి తేదీ. అలానే రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు మే 25, 2025 చివరి తేదీ. రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు మే 30, 2025 చివరి తేదీ. రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు జూన్ 02, 2025 చివరి తేదీగా నిర్ణయించారు.
పరీక్ష తేదీలు..
19 సబ్జెక్టులకు రాత పరీక్ష తేదీలు జూన్ 16 నుంచి జూన్ 19 వరకు జరుగుతాయి. హాల్‌టికెట్లను జూన్ 7వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
పరీక్ష విధానం..
రాత పరీక్ష 2 గంటల పాటు ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
దరఖాస్తు ఫీజు..
ఎగ్జామ్ కోసం అపప్లయి చేసుకునే అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.
జనరల్ అభ్యర్ధులు రూ.1100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.600












Click it and Unblock the Notifications