రైల్వేలో ఉద్యోగాల జాతర.. భారీ జీతంతో 22,000 పోస్టులు !!
ప్రభుత్వా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 22,000 గ్రూప్-డి (లెవల్-1) ఉద్యోగాలను పూరించనున్నారు. ఈ మేరకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ - CEN No. 09/2025ను అధికారికంగా విడుదల చేసింది. రైల్వేలో శాశ్వత ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక అరుదైన అవకాశం అని చెప్పవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో కీలకమైన గ్రూప్-డి విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్-IV, అసిస్టెంట్ (వర్క్‌షాప్), అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు రైల్వే వ్యవస్థలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడతాయి. ముందుగా జనవరి 21 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, తాజా షెడ్యూల్ ప్రకారం జనవరి 31, 2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 3, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

విద్యార్హతలు..
ఈ గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులు లేదా ఐటీఐ (ITI) పూర్తిచేసి ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధించిన ట్రేడ్ అర్హతలు అవసరం ఉండవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయోపరిమితి & సడలింపులు..
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపులు ఇలా ఉన్నాయి:
• ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
• ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
• దివ్యాంగులు (PwBD) - గరిష్టంగా 10 సంవత్సరాలు
వేతన వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం జీతభత్యాలు అందిస్తారు. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ. 18,000 కాగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రావెల్ అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత, పెన్షన్, ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం..
గ్రూప్-డి పోస్టుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది.
మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు.
అనంతరం అర్హులైన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్ష (PET) ఉంటుంది.
చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ఫోటో, సంతకం, విద్యా ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని RRB సూచించింది.
అభ్యర్థులకు సూచనలు..
దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని, తమకు సంబంధించిన రైల్వే జోన్, పోస్టుల వివరాలు, అర్హతలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు. తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు indianrailways.gov.in వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించాల్సి ఉంటుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications