RRB: రైల్వేలో కొలువుల జాత‌ర‌...9,144 టెక్నీషియన్ పోస్టులు..

నిరుద్యోగుల‌కు రైల్వేశాఖ తీపిక‌బురును అందించింది. రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకునేవారికి ఇదొక సువ‌ర్ణ అవకాశం. దేశ‌వ్యాప్తంగా ఉన్న మొత్తం 21రైల్వే రీజియ‌న్ల పరిధిలో మొత్తం 9,144 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ పోస్టుల‌కు సంబంధించిన సంక్షిప్త ఉద్యోగ ప్ర‌క‌ట‌న ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

మొత్తం 9,144 టెక్నీషియ‌న్ పోస్టుల‌కు మార్చి 9నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఆయా రైల్వే రీజియ‌న్ల వెబ్‌సైట్‌ల‌లో నోటిఫికేష‌న్ అందుబాటులోకి ఉంచ‌నున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఈనెల 9నుంచి వ‌చ్చే నెల 8వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భర్తీచేయనున్నారు.

RRB 9 144 technician posts in Railways

మొత్తం పోస్టుల‌లో టెక్నీషియన్ (గ్రేడ్-I) సిగ్నల్ 1,092 పోస్టులు కాగా, టెక్నీషియన్ గ్రేడ్-III: 8052 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల‌కు ఆయా విద్యార్హ‌త‌లున్నాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఈబీసీలు, దివ్యాంగులయితే రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పోస్టుల‌ను రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

టెక్నీషియన్ (గ్రేడ్-I) సిగ్నల్ పోస్టులకు విద్యార్హ‌త‌లు

బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఇన్‌స్ట్రుమెంటేషన్) చ‌దివి ఉండాలి.

టెక్నీషియన్ (గ్రేడ్-III) పోస్టులకు విద్యార్హ‌త‌లు..

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.

వ‌య‌సు

01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాల వ‌యోప‌రిమితి, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగావ‌యోప‌రిమిత‌, దివ్యాంగులకు కేటగిరీలవారీగా వ‌యోప‌రిమితి ఉంటుంది.
అప్ల‌య్ చేయు విధానం : ఆన్‌లైన్ ద్వారా మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.

శాల‌రీ : నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 వేత‌నంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+