Sainik School Admissions: సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లు-నోటిఫికేషన్ విడుదల-వివరాలివే..!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సైనిక్ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరంలో ఆరు, తొమ్మిది తరగతుల్లో అడ్మిషన్ల (Sainik School Admissions) కోసం నోటిఫికేషన్ (AISSEE 2027) విడుదలైంది. అర్హులైన విద్యార్దులు దరఖాస్తు చేసుకుంటే, ప్రవేశ పరీక్ష నిర్వహించి అడ్మిషన్లు ఖరారు చేస్తారు. దీనికి సంబంధించిన వివరాలు, ఫీజు, దరఖాస్తు విధానం, ఇలా అన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం విద్యార్దులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 2 వరకూ అవకాశం కల్పించారు. అలాగే ఆలస్య ఫీజుతో డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య ఫీజు 500 ఉంటుంది. ఇది కాకుండా జనరల్, ఓబీసీ, రక్షణ సిబ్బంది పిల్లలు, మాజీ సైనికుల పిల్లలకు రూ.850 ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.700 ఫీజు నిర్ణయించారు. ఇలా విద్యార్దులు సమర్పించిన దరఖాస్తుల్లో సవరణలకు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ అవకాశం కల్పిస్తారు. ఇక హాల్ టికెట్లను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తారు. జనవరి 31న సైనిక్ స్కూల్ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

సైనిక్ స్కూల్ అడ్మిషన్ల కోసం పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్ షీట్లపై మార్కింగ్ ద్వారా విద్యార్ధులు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో అన్నీ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి. 6వ తరగతి అడ్మిషన్లకు నిర్వహించే పరీక్షకు 150 నిమిషాలు సమయం ఇస్తారు. అలాగే 9వ తరగతి పరీక్ష రాసేందుకు 180 నిమిషాల సమయం ఉంటుంది. ఆన్ లైన్ లో సైనిక్ స్కూల్స్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://exams.nta.nic.in/sainik-school-society/ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల్లో విద్యార్ధులు సాధించిన మార్కుల ఆధారంగా సైనిక స్కూళ్లలో 6, 9 తరగతుల్లో మాత్రమే ప్రవేశాలు ఖరారు చేస్తారు.












Click it and Unblock the Notifications
