Karnataka News: కర్ణాటకలో ఉర్థూ వివాదం.. అంగన్‌వాడీ టీచర్లకు ఆదేశాలపై బీజేపీ ఫైర్..
Urdu For Anganwadi's: కర్ణాటకలో హిజాబ్ వివాదం తర్వాత కొత్తగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. అయితే అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీ వ్యవహారంలో అభ్యర్థులకు తప్పనిసరిగా ఉర్దూ భాష వచ్చి ఉండాలని చెప్పింది. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. ఇది సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 'ముస్లింల బుజ్జగింపు' చర్య అని పేర్కొంది.
వెంటనే ఆర్డర్‌ను ఉపసంహరించుకోకపోతే, కన్నడకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నిరసనలు చేస్తామని ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చింది. అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం రావాలంటే ఉర్దూ భాష తెలుసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం ఖండనీయమని.. అంగన్‌వాడీ టీచర్ల నియామకాల్లో ముస్లిం వర్గాలను మభ్యపెట్టి వారికి మాత్రమే అవకాశం కల్పించాలని బ్యాక్ డోర్‌లో ప్రయత్నించడంగా బీజేపీ నాయకుడు, మాజీ ఎంపి నళిన్‌కుమార్ కటీల్ పేర్కొన్నారు.

ಅಂಗನವಾಡಿ ಶಿಕ್ಷಕಿ ಕೆಲಸ ಸಿಗಬೇಕಾದರೆ ಉರ್ದು ಭಾಷೆ ಗೊತ್ತಿರಬೇಕು ಎಂಬ ರಾಜ್ಯದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರಕಾರದ ಘೋಷಣೆ ಖಂಡನೀಯ.
— Nalinkumar Kateel (@nalinkateel) September 23, 2024
ಅಂಗನವಾಡಿ ಶಿಕ್ಷಕರ ನೇಮಕಾತಿಯಲ್ಲಿಯೂ ಮುಸ್ಲಿಂ ಸಮುದಾಯವನ್ನು ಒಲೈಸುವ, ಅವರಿಗೆ ಮಾತ್ರ ಕೆಲಸ ಸಿಗುವಂತೆ ದಾರಿ ಮಾಡಿಕೊಡುವ ಹಿಂಬಾಗಿಲ ಯತ್ನ ಮತ್ತೊಮ್ಮೆ ಕಾಂಗ್ರೆಸ್ಸಿಗರ ಕುಟಿಲ ನೀತಿ ಎತ್ತಿ ತೋರಿಸುತ್ತಿದೆ.
ಅಸಹ್ಯ… pic.twitter.com/M6Ry24dOr3
దీనిపై కర్ణాటక బీజేపీ సైతం ట్విట్టర్ వేధిగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉర్దూను విధిస్తోంది. చిక్‌మగళూరు జిల్లా ముదిగెరెలో అంగన్‌వాడీ టీచర్ల నియామకానికి ఉర్దూను తప్పనిసరి చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయటాన్ని తప్పుపట్టింది. అయితే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవటంతో సిద్ధరామయ్య ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వివరణ జారీ చేస్తూ కన్నడ ఎప్పటికీ అత్యధిక ప్రాధాన్యత భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చింది. పిల్లలు వివిధ నేపథ్యాల నుంచి వస్తున్నందున వారితో పరిచయం, ప్రారంభ దశలో వారితో మాట్లాడటానికి ఈ ఆర్డర్ జారీ చేసినట్లు వివరణ ఇచ్చింది.
ಘನವೆತ್ತ ರಾಜ್ಯಪಾಲರು ನೀಡಿದ್ದ ಪ್ರಾಸಿಕ್ಯೂಶನ್ ರದ್ದು ಮಾಡುವಂತೆ ಸಿದ್ಧರಾಮಯ್ಯನವರು ಹೈಕೋರ್ಟ್ ನಲ್ಲಿ ಸಲ್ಲಿಸಿದ್ದ ಮೇಲ್ಮನವಿ ಅರ್ಜಿಯನ್ನು ಮಾನ್ಯ ಉಚ್ಚ ನ್ಯಾಯಾಲಯ ವಜಾ ಮಾಡಿರುವುದು ಸ್ವಾಗತಾರ್ಹ.
— Nalinkumar Kateel (@nalinkateel) September 24, 2024
ಈ ಮೂಲಕ ಸಿಎಂ ವಿರುದ್ಧ ತನಿಖೆಗೆ ಗ್ರೀನ್ ಸಿಗ್ನಲ್ ಸಿಕ್ಕಿದ್ದು, ಒಂದು ದಿನವೂ ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುವ ನೈತಿಕತೆಯನ್ನು… pic.twitter.com/0CNEv4qO94
ఉర్దూ అధికారిక భాష కానందున, ప్రధానంగా ఉర్దూ-మీడియం పాఠశాలల్లో ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా అందించబడుతోంది. అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ కోసం దీనిని తప్పనిసరి చేయడం అన్యాయమని నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2017 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉర్దూ బోధనను ప్రవేశపెట్టాలని ప్రయత్నించటం దీనికి అనుగుణంగా ప్రస్తుతం అడుగులు వేయటం కర్ణాటకలో ప్రస్తుతం పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనే ఆసక్తి కన్నడ ప్రజల్లో సైతం పెరుగుతోంది.












Click it and Unblock the Notifications