School Fee: ఫస్ట్ క్లాస్ స్కూల్ ఫీజుపై నెట్టింట బిగ్ డిబేట్.. 20 లక్షల శాలరీ కూడా కష్టమే..

Viral Post: ఈ కాలంలో పిల్లల్ని పెంచడం కంటే వారి స్కూల్ ఫీజులు చెల్లించడమే తల్లిదండ్రులకు భారంగా మారింది. నర్సరీలో ప్రవేశానికి లక్షల కొద్దీ ఛార్జ్ చేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. విద్యను వ్యాపారంగా మార్చడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఒక ప్రధాన నగరంలోని సుప్రసిద్ధ పాఠశాల ఫీజు వివరాలను రిషబ్ జైన్ అనే పేరెంట్ తన X ఖాతాలో పంచుకున్నారు. 1వ తరగతికి గాను ఏడాది మొత్తం కలిపి 4 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అడ్మిషన్ ఫీజులు, కాషన్ మనీతో పాటు పాఠశాల ఫీజులు, బస్సు ఛార్జీలు, పుస్తకాలు మరియు యూనిఫాంల ఖర్చులు కూడా కలిపి వివరించారు.

Social media post about school fee went viral

జైన్ షేర్ చేసిన ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

పాఠశాల వార్షిక ఫీజు : ₹2,52,000
బస్ ఛార్జీలు : ₹1,08,000
అడ్మిషన్ ఫీజు : ₹40,000
పుస్తకాలు & యూనిఫాం : ₹20,000
కాషన్ మనీ (వాపసు ఇవ్వదగినది): ₹5,000
రిజిస్ట్రేషన్ ఛార్జీలు : ₹2,000
మొత్తం : ₹4,27,000

'భారతదేశంలో నాణ్యమైన విద్య పొందాలంటే ఇంత ఖర్చు పెట్టాలి. మీరు సంవత్సరానికి 20 లక్షలు సంపాదించినా ఈ స్థాయిలో ఖర్చును భరించగలరా? లేదు. 20 లక్షల ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్ లోకి వస్తారు. కాబట్టి పెద్దఎత్తున ఆదాయపు పన్ను, GST, VAT, టోల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ వంటి వివిధ రకాలైన పన్నులు చెల్లించడం తప్పనిసరి. మిగిలిన దానిలోనూ టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, PF, NPS వంటి వాటిని మేనేజ్ చేయాలి' జైన్ తన అసహనాన్ని వెళ్లగక్కారు.

ఆయన పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతూ పోతున్న విద్యా ఖర్చులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే 12 ఏళ్లలో దాదాపు 1 నుంచి 1.2 కోట్లు ఖర్చు అవుతుందని, మధ్యతరగతి వారు ఇంత ఫీజులు భరించలేరని వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఇది తీవ్రమైన సమస్య అని, దీని నియంత్రణపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

నాణ్యమైన విద్య ఎప్పుడూ విలాసవంతంగా ఉండకూడదు, ప్రాథమిక హక్కుగా ఉండాలని మరొక వినియోగదారు పోస్ట్ చేశారు. 'అంత భారీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్‌లో పిల్లల్ని చదివించడం చాలా మంది కేవలం స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. కేవలం 1 శాతం పాఠశాలలు మాత్రమే ఇంత ఫీజును వసూలు చేస్తున్నాయి. అంటే 1 శాతం స్కూల్స్ మాత్రమే నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అర్థం కాదు' అని మరో వినియోగదారుడు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+